Raghuramakrishnam Raju’s petition dismissed: రుషి కొండ తవ్వకాల కేసు.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ డిస్మిస్

రుషి కొండలో అక్రమంగా ప్రభుత్వం తవ్వకాలు చేస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రతి చిన్న విషయం సుప్రీంకోర్టే తేల్చాలంటే ఎలా అని పిటిషనర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

  • Written By:
  • Publish Date - November 11, 2022 / 05:58 PM IST

Rushikonda: రుషి కొండలో అక్రమంగా ప్రభుత్వం తవ్వకాలు చేస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రతి చిన్న విషయం సుప్రీంకోర్టే తేల్చాలంటే ఎలా అని పిటిషనర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. హైకోర్టులో విచారణలో ఉందని అక్కడే ఏదైనా తేల్చుకోవాలని సూచించింది.

విశాఖలో ఉన్న రుషి కొండలో ప్రభుత్వం రెండు కిలోమీటర్ల మేర తవ్వకాలు చేస్తోందని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బయటకు తప్పుడు సమాచారాన్ని అందిస్తూ.. ఇష్టారాజ్యంగా ప్రభుత్వం తవ్వేస్తోందని ఆయన ఆరోపించారు. దీనిపై వాదనలు వినిపించి, ఫొటోలు కూడా సమర్పించారు. అయినా వాదనలు వినేందుకు నిరాకరించింది.

ఈ సందర్భంగా పిటిషనర్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ ఇప్పటికే హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టుకు ఎలా వస్తారని పిటిషనర్ ను ప్రశ్నించింది. ఏదన్నా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ప్రతీ విషయం సుప్రీంకోర్టులో తేల్చుకోవాలంటే ఎలా అని ప్రశ్నించింది. కాబట్టి, పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నామని తేల్చి చెప్పింది