Accident: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. కారును ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న 63 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదం..
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. కారును ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న 63 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.
బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ కి చెందిన బస్సు.. కూకుటిమానగడ్డ వద్ద కారును వెనక నుంచి ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో 60 మందికి పైగా ప్రయాణికులు అందులో ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో 63 మంది గాయపడ్డారు. 56 మంది స్వల్ప గాయాలతో బయటపడగా.. ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను బయటకు తీసి.. స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మదనపల్లె ఆర్డీవో మురళీ, డీఎస్పీ శేషప్ప, పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వద్దకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అతివేగంగా రావడం, బ్రేక్ వేసినా బస్సు అదుపు కాకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.