Site icon Prime9

CEO Prime9 News P venkateswararao: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపిన ప్రైమ్9 సీఈవో వెంకటేశ్వరరావు..

Prime9 News CEO venkateswararao congratulate nagababu

Prime9 News CEO venkateswararao congratulate nagababu

Prime9 News CEO venkateswararao : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు, జనసేన నేత నాగబాబుకు పార్టీలో పదోన్నతి ఇచ్చారు. నాగబాబు ఇప్పటి వరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే తాజాగా నాగబాబును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎన్నారై విభాగం కార్యకలాపాలను కూడా నాగబాబు పర్యవేక్షించనున్నారు. ఇతర దేశాల్లోని జనసేన శ్రేణులను సమన్వయపరచడం, ఎన్నారైల సేవలను పార్టీ కోసం వినియోగంచుకోవడం వంటి బాధ్యతలను కూడా నాగబాబుకు అప్పగించారు. ఈ మేరకు నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల పలువరు ప్రముఖులు, జనసేన నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ మేరకు తాజాగా ప్రైమ్9 న్యూస్ ఛానల్ సీఈవో పి. వెంకటేశ్వరరావు నాగబాబుని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు, ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటడంలో ముందుండే జనసేన పార్టీకి తన వంతుగా ఎప్పుడు ముందుండే నాగబాబు పదవి దక్కడం పట్ల వేంకటేశ్వర రావు హర్షం వ్యక్తం చేశారు. నాగబాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, జనసేన పార్టీ ప్రజల కోసం ఎల్లప్పుడూ నిలబడాలని కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ గా మారాయి.

 

Exit mobile version