Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ షరతులు ఏంటంటే?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడతను కూడా ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 03:26 PM IST

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడతను కూడా ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ తెలపింది. ఆగస్టు 19వ తేదీ వరకూ మూడో విడప వారాహి విజయ యాత్ర సాగనుంది.

ఈ క్రమంలోనే జనసేన నాయకులు.. వారాహి యాత్రకు అనుమతుల కోసం పోలీసులను సంప్రదించారు. అయితే విశాఖలో వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. జగదాంబ సెంటర్‌లో సభకు మాత్రమే అనుమతిని ఇచ్చిన పోలీసులు.. ర్యాలీలపై నిషేధం విధించారు. వాహన ర్యాలీలు, అభివాదం చేయవద్దని స్పష్టం చేశారు. భవనాలు, ఇతన నిర్మాణాలపై కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేన పార్టీదేనని పోలీసులు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడితే అనుమతి పొందినవారిదే బాధ్యత అని షరతు విధించారు. అయితే వారాహి యాత్రకు పోలీసులు విధించిన షరతులపై జనసేన పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇక రేపటి నుంచి యాత్ర ప్రారంభించనున్న తరుణంలో పవన్ ఈరోజు విశాఖ చేరుకోనున్నారు. మరోవైపు జగదాంబ జంక్షన్‌లో పవన్ సభ నిర్వహించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. గత రెండు విడతల యాత్రను మించి మూడో విడత వారాహి యాత్రను సక్సెస్ చేయాలని జనసేన భావిస్తోంది. ఇక, వారాహి యాత్రను పర్య వేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. మరోవైపు మెగాస్టార్ ఏపీ సర్కారుపై చేసిన కామెంట్లు తీవ్ర సంచలనంగా మారాయి. చిరుపై వైకాపా నేతలు వరుసగా మాటల యుద్ధానికి దిగుతూ విమర్శలు చేస్తున్నారు.