Site icon Prime9

Yuvagalam Yatra : యువగళం యాత్రలో హై టెన్షన్.. టీడీపీ వాలంటీర్ల అరెస్ట్, నారా లోకేష్ కు నోటీసులు జారీ

police gives notices to nara lokesh about comments in yuvagalam yatra

police gives notices to nara lokesh about comments in yuvagalam yatra

Yuvagalam Yatra : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర క్యాంప్‌ సైట్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలోనే ఆర్ధ రాత్రి సమయంలో యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వాలంటీర్లపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా యువగళం పాదయాత్రకి అనుమతి ఇచ్చి అదే దారిలో వైకాపా కార్యకర్తలు పలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, రాళ్ల దాడి చేస్తే పోలీసులు చూస్తూ ఉండిపోయారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.యువగళం వాలంటీర్లు, కిచెన్‌ సిబ్బంది సహా సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారని.. వారిపై విచక్షణారహితంగా దాడి చేశారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే భీమవరం సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భీమవరం సీఐ నోటీసులు తీసుకురాగా.. లోకేశ్ వాటిని సున్నితంగా తిరస్కరించారు.

 

 

పక్కా పథకం ప్రకారమే యువగళం పాదయాత్రపై వైసీపీ మూకలు రాళ్లు దాడి చేశారని లోకేశ్ మండిపడ్డారు. తాము చట్టాన్ని గౌరవించే వ్యక్తులమని, ఎవరినీ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన భీమవరం సీఐ ప్రసాద్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు కాకుండా, చట్టాన్ని అతిక్రమించిన వారికి నోటీసులు ఇవ్వాలని అన్నారు. ఇది ఎన్నికల సమయం కాదని, అన్ని వెహికల్స్ పెట్టకూడదని పోలీసులు ఎలా చెబుతారని లోకేష్ ప్రశ్నించారు. తనకిస్తున్న నోటీసును వైసీపీ వారికి ఎందుకు ఇవ్వడంలేదని అడిగారు.

పేదలకు, పెత్తందార్లకు యుద్ధమని తమ అధినేత చంద్రబాబు ఫొటోలు వేశారని.. జగన్ కు లక్ష కోట్ల ఆస్తి ఉందని, రూ.12 కోట్లు ఖర్చు పెట్టి లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాడని, లక్ష రూపాయల చెప్పులు వేసుకుంటున్నాడని, వెయ్యి రూపాయలు విలువ చేసే వాటర్ బాటిల్ ని తాగుతున్నాడని, పెత్తందారు ఎవరని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలను గొడవకు ప్రేరేపించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు నోటీసులివ్వాలని చెప్పారు.

Exit mobile version