Polavaram issue: పోలవరం అంశాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు.. రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. పోలవరం ఎత్తు తగ్గించాలన్న కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రంతో రాజీ పడితే రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే అని కేవీపీ అన్నారు.
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం చేతిలో ఉంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కేంద్ర ఎంత ఒత్తిడి చేసినా, ఇతర రాష్ట్రాల అభ్యంతరాల్లో,
భూ సేకణ, పునరావాస, పునర్ నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధుల కావాలనే కారణాలు చూపించినా అంగీకరించొద్దు.
పోలవరాన్ని పూర్తి స్థాయిలో, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందించడానికి కట్టబడి ఉంటారని ఆశిస్తున్నా’ అని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.
పోలవరం నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమని.. నిధులు లేవని కేంద్రం పోలవరం ఎత్తు తగ్గించే ఆలోచనలో ఉందని లేఖలో ఆయన ప్రస్తావించారు.
ప్రాజెక్టు నిర్మాణం మొత్తం రాష్ట్రం చేతుల్లో ఉందని.. కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తలొగ్గవద్దని సూచించారు. ఎత్తు తగ్గితే.. రాష్ట్రం చాలా నష్టపోతుందన్నారు.
పోలవరం ఎత్తు తగ్గకుండా నిర్మాణం చేపట్టాలని .. ఒక వేల పోలవరం ఎత్తు తగ్గిస్తే ద్రోహం చేసినట్లే అన్నారు.
ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ఏర్పాటైన ప్రాజెక్టు అథారిటీకి నిర్మాణ బాధ్యత అప్పగించినా కూడా ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని కేవీపీ లేఖలో అన్నారు.
ప్రాజెక్టు పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలని, రాష్ట్రంపై వేయకూడదని 2017 లో తాను హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
సదరు పిటిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు కానందున అవి ఇంకా పెండింగ్ లోనే ఉందని తెలిపారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చు బాధ్యత కేంద్రానిదే అన్నారు.
ప్రాజెక్టు ఎత్తును కుదించి..ఖర్చు తగ్గించేలా కేంద్రం రచించే ప్రణాళికలను అనుమతించొద్దన్నారు.
పోలవరం రిజర్వాయర్ లెవల్ 150 అడుగుల కంటే తక్కువగా ఉంటే ప్రాజెక్టు నుంచి ఆశించిన ప్రయోజనాలు అందడం అసాధ్యమని కేంద్ర జల సంఘం ఎప్పుడో చెప్పిందన్నారు.
పోలవరం రిజర్వాయర్ లెవల్ 140 అడుగులు.. 150 అడుగుల మధ్య కాంటూర్ లో సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని లేఖలో ప్రస్తావించారు.
ఈ ఖర్చు తగ్గించుకోవడానికి కేంద్రం ప్రాజెక్టు ఎత్తును 140 అడుగులకు కుదించవలసిందిగా రాష్ట్రంపై ఒత్తిడి చేస్తున్నట్లు కేవీపీ ప్రస్తావించారు.