Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురంలో సభ నిర్వహించారు. సభావేదికగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. ప్రక్షాళన, పరివర్తన కోసమే తన పోరాటమని, తాను ఈ పోరాటం చేస్తున్నానని ఈ పోరాటంలో నేను బతికుంటానో లేదో తెలియదని పవన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘‘ సీఎం జగన్‌కి చెబుతున్నా.. రోజులు మారాయి. మాటలతో మోసం చేసే కాలం కాదు.. తిరగబడే కాలం’’ అంటూ నరసాపురం వేదకగా పవన్ హెచ్చరించారు. పాలకులు ప్రజల చెమట, రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తున్నారంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. పులివెందుల విద్యా సంస్కృతిని గోదావరి జిల్లాలకు రానివ్వవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “జగన్ మోహన్ రెడ్డికి చెబుతున్నా.. మీరు పులివెందుల రౌడీ రాజకీయం గోదావరి జిల్లాలకు తీసుకువచ్చారు. నరసాపురం నుంచి చెబుతున్నా.. ఇది గూండాలకు, రౌడీలకు భయపడే నేల కాదు.. ఎవర్నయినా ఎన్నిసార్లు భయపెట్టగలరు? కానీ నరసాపురం ప్రజల్ని కాదు అంటూ ఆయన స్పష్టం చేశారు. కోనసీమలో డీఎస్పీని ఓ మంత్రి కొడుకు కొట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే విప్లవాలు పుట్టుకొస్తాయని ఓ విప్లవకారుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూస్తారు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గెలిస్తేనే రాజ్యాంగం గెలిచినట్టు.. లేకపోతే లేదు అననట్టుగా మాట్లాడుతారు జగన్.. ఇక్కడ పసలదీవి పంచాయతీలో జనసేనకు 1,400 ఓట్లు రాగా, వైసీపీకి 380 ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఇలా జనసేనకు పసలదీవి ప్రజలు మద్దతు తెలిపినందుకు ఆ పంచాయతీకి నిధులు ఇవ్వడం మానేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా రాజ్యాంగం?” అంటూ పవన్ విమర్శలు కురిపించారు.
ఇప్పుటు ఏపీ అనేది అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందని అభివృద్ధి అనేది నువ్ నొక్కని బటన్ అని.. ఆడపిల్లకు రక్షణలేని ప్రభుత్వం నువ్ నొక్కని బటన్ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మన జనసేన అధికారంలోకి వస్తే ముఠామేస్త్రిలా పనిచేస్తానని అవినీతిని ఊడిచేస్తామని.. బటన్లు నొక్కడం మన పనికాదు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 500 యువతని ఎంపిక చేసి దామాషా పద్దతి ప్రకారం ఒక్కొక్కరికి రూ. 10లక్షల ఆర్థిక సాయం చేస్తాం దానితో మీకు ఉపాధి వ్యాపార అభివృద్ధికి సాయం చేస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి 25లక్షల రూపాయలు భీమా ఇస్తామని చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీకి మించి హెల్త్ సెక్యూరిటీని పట్టుకొస్తామని చెప్పారు.
2008 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని.. మార్పుకోసం పంతం పట్టి కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో విద్య, వైద్యం, ఉపాధి మూడు కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోయాయని, మిగతా వాళ్ళు దేహీ అనే పరిస్థితిలో ఉన్నారని దీని నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించాలి ఈ పరిస్థితి ఇలానే ఉండకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రం కోసం.. గోదావరి జిల్లాల ప్రజల కోసం ఇక్కడ నుంచి కొంతమంది ముందుకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. పదవులకోసం పార్టీని తాకట్టు పెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలంటే ఎంతసేపు బూతులు తిట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడంగా మార్చేశారని, అందరి దృష్టి, దిష్టి గోదావరి జిల్లాలపైన పడిందని ఆయన అన్నారు. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించేందుకు గోదావరి జిల్లాల నుంచి పోరాటం మొదలు పెట్టానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదనే లక్ష్యంగా పెట్టుకుని తాను ఈ యాత్ర ఇక్కడి నుంచి మొదలుపెట్టానని పేర్కొన్నారు.