Pavan Kalyan: విజయవాడ బయలుదేరిన పవన్ కళ్యాణ్

విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమైనట్టుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 05:03 PM IST

Pavan Kalyan:  విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమైనట్టుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలు దేరారు.విశాఖ నుంచి బయల్దేరే ముందు ఓ వీడియో రిలీజ్ చేసిన పవన్ కల్యాణ్‌ ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న చర్యలను పవన్ కల్యామ్ తీవ్రంగా ఖండించారు. కనీసం తన కోసం వెయిట్ చేస్తున్న వారిని కలిసేందుకు కాదు కదా.. దూరం నుంచి వారికి అభివాదం చేసేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆక్షేపించారు. దీని కచ్చితంగా సమాధానం చెప్పే రోజులు వస్తాయన్నారు పవన్. ఇలాంటి ఆంక్షలే భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు.మొన్న రాత్రి నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిపారు. చాలా మందిని బెయిల్‌పై బయటకు తీసుకురావడం జరిగిందని.. రిమాండ్ విధించినవారికి కూడా బెయిల్ వచ్చేలా న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అది రేపు విచారణకు రానుందని తెలిపారు

ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. . ఇక, రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌ను పవన్ కల్యాణ్ కలిసే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే జనసేనకు గవర్నర్ అపాయింట్‌మెంట్ విషయంలో స్పష్టత రావాల్సి ఉందని తెలుస్తోంది. రేపు గవర్నర్ అపాయింట్‌మెంట్ లభిస్తే.. తన విశాఖ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను పవన్ ఆయనకు వివరించే అవకాశం ఉంది.