Site icon Prime9

Nara Lokesh: కావలికి బయలుదేరిన నారా లోకేష్

nara-lokesh-chalo-kavali

Andhra Pradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో బాగంగా ఛలో కావలి పేరిట బయలుదేరి వెళ్లారు. లోకేష్ వెంట భారీగా తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు కావలికి బయలుదేరారు.

ముసునూరు గ్రామంలో ఎస్సీ యువకుడు దుగ్గిరాల కరుణాకర్. వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఇటీవల లేఖ రాసి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కరుణాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించనున్నారు. ఇటీవల లోకేష్ శ్రీకాకుళం, విశాఖ పర్యటనలను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో నేటి కావలి పర్యటన పై ఉత్కంఠ నెలకొంది.

ఇలా ఉండగా కావలికి బయలుదేరిన నారా లోకేష్ కు అడుగడుగునా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. లోకేష్ వాహనాన్ని ఆపుచేసి పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారు. దీనితో లోకేష్ పర్యటన నిర్ణయించిన సమయం కంటే ఆలస్యంగా జరిగే అవకాశముంది.

Exit mobile version