Site icon Prime9

Nara Lokesh : పునః ప్రారంభం అయిన “యువగళం” పాదయాత్ర.. వడ్డీతో సహ చెల్లిస్తా అంటున్న నారా లోకేష్

Nara Lokesh yuvagalam padayatra again started from razole

Nara Lokesh yuvagalam padayatra again started from razole

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన “యువగళం” పాదయాత్ర గురించి తెలిసిందే. 209 రోజులు ఆయన తన పాదయాత్రలో సుమారు 2852 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇంతలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఇక ఇప్పుడు చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో నారా లోకేశ్ పాదయాత్రను పున:ప్రారంభించారు. ఎక్కడైతే ఈ పాదయాత్ర ఆగిందో.. అక్కడి నుంచే పున:ప్రారంభం అయ్యింది.

రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం 10.19 గంటలకు లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలయ్యింది. అనంతరం స్థానిక తాటిపాక సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు జనం సునామీలా వచ్చారు.  కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంఘీభావంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ.. తనపై ఆరు కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్రను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

అదే విధంగా చంద్రబాబును జైలుకు పంపితే తన పాదయాత్ర ఆగుతుందని భ్రమపడ్డారని ఎద్దేవా చేశారు. చివరికి అన్న క్యాంటీన్‌నూ వదలేదని విమర్శించారు. స్కిల్ ఖాతాలో ఒక్క ఆధారమైనా చూపించలేకపోయారని ధ్వజమెత్తారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారని నారా లోకేష్ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ఇక్కడ నిల్చున్నానని తెలిపారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటానని హెచ్చరించారు.

 

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో వైకాపాను గద్దె దించడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓట్లను చీలనివ్వకుండా ప్రజా సంక్షేమం కొరకు ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పని చేస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటు పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఉమ్మడిగా చర్చలు జరుపుతున్నారు. ఇక త్వరలోనే జనసేన వారాహి యాత్ర కూడా ప్రారంభం కానుందని సమాచారం అందుతుంది.

Exit mobile version