Site icon Prime9

Nara Lokesh : యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్న నారా లోకేష్.. పల్నాడు జిల్లాలోకి అదిరిపోయే వెల్ కమ్

nara lokesh yuvagalam padayatra 172 day details

nara lokesh yuvagalam padayatra 172 day details

Nara Lokesh : తెదేపా నేత నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ఎండా.. వాన.. దేన్ని లెక్కచేయకుండా.. ప్రజలతో మమేకం అవుతూ పాదయాత్రని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ మేరకు నిన్నటితో ( ఆగస్టు 1వ తేదీ ) 172 వ రోజుకి చేరిన ఈ యాత్రలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వీడ్కోలు పలికి పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యారు. ఈ మేరకు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో వేలాది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం వద్ద పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నేతృత్వంలో యువనేతకు ఘనస్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాలతో యువనేతను ప్రజలు స్వాగతించారు.

అలానే వీరితో పాటు టీడీపీ లీగల్ సెల్ లోని హైకోర్టు అడ్వకేట్స్ అయిన.. గింజుపల్లి సుబ్బారావు, శ్రీనివాసులు, లక్ష్మీ నారాయణ, పుల్లగూర నాగరాజు.. యువ నేత రాంబాబు.. లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆయనతో పాటు పాదం కలిపారు. యువగళానికి సంఘీభావంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అక్కడ నుంచి పలు గ్రామాల మీదుగా సాగిన యాత్రలో చివరకు గుర్రపునాయుడుపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది.

కాగా అంతకు ముందు 17 రోజుల పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. తనను తోబుట్టువులా ఆదరించిన ప్రకాశం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఏ కష్టమొచ్చినా పార్టీ కేడర్ కు వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. యువగళం స్పూర్తితో రాబోయే ఎన్నికల్లో పసుపుజెండా రెపరెపలాడాలని చెప్పారు. నాయకులంతా కలసికట్టుగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచారని మండిపడ్డారు.

173వ రోజు (2-8-2023) యువగళం వివరాలు (Nara Lokesh) .. 

వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం ( పల్నాడు జిల్లా )

ఉదయం 8.00 – గుర్రపునాయుడుపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – ఉప్పలపాడులో రైతులతో సమావేశం.

11.00 – చాట్రగడ్డపాడులో స్థానికులతో మాటామంతీ.

12.00 – వినుకొండ గంగినేని డిగ్రీ కాలేజి సమీపంలో భోజన విరామం.

సాయంత్రం 4.00 – వినుకొండ గంగినేని డిగ్రీ కాలేజి వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.20 – చెక్ పోస్టు వద్ద స్థానికులతో సమావేశం.

4.40 – ముండ్లమూరు బస్టాండులో స్థానికులతో మాటామంతీ.

5.00 – ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.15 – బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.

9.45 – నగరాయపాలెం విడిది కేంద్రంలో బస.

Exit mobile version