Site icon Prime9

Nara Lokesh : చంద్రబాబును జైలులోనే అంతం చేసేందుకే వైసీపీ కుట్ర – నారా లోకేష్

nara lokesh shocking tweet on chandrababu naidu arrest

nara lokesh shocking tweet on chandrababu naidu arrest

Nara Lokesh : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబును సెంట్రల్ జైలుకు పంపించినప్పటి నుంచి ఆయన భద్రతపై టీడీపీ లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ములాఖత్‌ తర్వాత చంద్రబాబుతో మాట్లాడిన భువనేశ్వరి, యనమల రామకృష్ణుడు దోమలు విపరీతంగా ఉన్నాయని, ఫ్యాన్ సరిగ్గా పని చేయడం లేదని నడుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించింది.. జైలు లోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయని నారా లోకేష్‌ ఆరోపించారు. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని ఆయన ఫైర్ అయ్యారు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ క్రమం లోనే రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటనను లొకేఎసహ ప్రస్తావించారు.

టైఫాయిడ్ కారణంగానే ఆ ఖైదీ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు లోకేష్ (Nara Lokesh) ఈ విషయాన్ని గురించి లేవనెత్తడం హాట్ టాపిక్ గా మారింది. సదరు ఖైదీ వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీతో మరణించారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని పన్నాగాలు చేస్తున్నారని.. ఆయనకి ఏం జరిగినా జగన్ దే బాధ్యతని హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ లో..

 

 

Exit mobile version