Site icon Prime9

Nara Lokesh: అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ ని అడ్డుకోరు.. నారా లోకేష్

nara-lokesh-anna-canteen

Andhra Pradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్నించారు. అన్నక్యాంటీన్ కు అడ్డుపడటం చూస్తే జగన్ లో మానవత్వం లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు.

అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ ని అడ్డుకోరు. జగన్ రెడ్డి గారు తింటుంది ఏంటో ఆయనే తేల్చుకోవాలి. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారు. ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారు. జగన్ రెడ్డిలో మానవత్వం అనేదే లేదా?

తెనాలిలో అన్న క్యాంటీన్ కి అడ్డుపడటం మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతాం. పేద వాళ్ళ ఆకలి తీరుస్తాం అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

Exit mobile version