Site icon Prime9

Nara Brahmani : చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోంది.. నిర్దోషిగా బయటకు వస్తారు – బ్రాహ్మణి

nara brahmani comments on ysrcp government over chandrababu naidu arrest

nara brahmani comments on ysrcp government over chandrababu naidu arrest

Nara Brahmani : చంద్రబాబు బయటికి వస్తే వైసీపీ అంతం తప్పదని నారా బ్రాహ్మణి అభిప్రాయపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే తెదేపా అధినేత చంద్రబాబును జైలుకు పంపారని అన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని.. చంద్రబాబు, లోకేశ్‌కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారని.. అలాంటిది వారి కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని వాపోయారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతను జైల్లో పెట్టారని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ఆయన చేసిన నేరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోంది.  ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారని.. జాతీయ నేతలు కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శించారని తెలిపారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందని.. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పారు.

 

Exit mobile version