Nandamuri Balakrishna : ఏపీ అసెంబ్లీలో నేడు మాటల వైసీపీ, టీడీపీ నాయకుల మాటల యుద్ధానికి తెర లేపింది. కాగా చంద్రబాబు అరెస్టు విషయంపై మొదలై తెదేపా నేతలను సస్పెండ్ చేసే వరకు వచ్చింది. అయితే సస్పెన్షన్ అనంతరం నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు తన వృత్తిని అవమానిస్తేనే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని బాలకృష్ణ వివరించారు. తానే కాదు తన స్థానంలో ఎవరైనా ఈ విషయమై రియాక్ట్ అవుతారన్నారు. తన వృత్తి తనకు తల్లిలాంటిందన్నారు. అలాంటి తన వృత్తిని అవమానిస్తే తాను ఊరుకుంటానా అని బాలకృష్ణ ప్రశ్నించారు. సినిమాల్లో చూపించుకో అని మంత్రి అంబటి రాంబాబు అన్నారన్నారు. దీనికి తాను రా చూసుకుందామని చెప్పానని బాలకృష్ణ వివరించారు. తాను ఎవరికి భయపడనన్నారు. కేసులకు కూడ తాను భయపడబోనని బాలకృష్ణ తేల్చి చెప్పారు.
అలానే చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని బాలకృష్ణ (Nandamuri Balakrishna) చెప్పారు. దీనిపై పోరాటం కొనసాగిస్తామని.. ఇలాంటి కేసులను గతంలో కూడ చూసినట్టుగా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుపై పెట్టిన కేసును భేషరతుగా ఎత్తివేయాలని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పుడు కేసు పెట్టినందుకు చంద్రబాబుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని బాలకృష్ణ కోరారు. సినీ రంగం నుంచి వెళ్లిన ఎన్టీఆర్ పార్టీని పెట్టి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని బాలకృష్ణ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏపీలో వైఎస్ జగన్ పాలనను నియంతృత్వంగా ఉందని ఆరోపించారు. టీడీపీని లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబును ఏపీ సిల్క్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 9వ తేదీన ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబును రాజమండ్రి జైల్లో ఉన్నాడు. ఈ కేసులో చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ కోర్టును కోరింది. ఈ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించనుంది. మరో వైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో కూడ చంద్రబాబుపై పీటీ వారంట్ జారీ చేశారు. దీనిపై చంద్రబాబు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 26న విచారణ నిర్వహించనుంది ఏపీ హైకోర్టు.