Andhra Pradesh: నాడు మదనపల్లి జిల్లా వద్దన్నారు, రాయచోటి ముద్దు అన్నారు. అలాగే మూడు రాజధానులు కూడా కాలయాపనకేనని, తిరుపతిని రాజధానిగా చేయ్యాలని ఎవ్వరికి అనిపించలేదా అని పీలేరు నియోజకవర్గ తెదేపా పార్టీ ఇన్ చార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శానససభ్యులు చింతల రామచంద్రారెడ్డి పై నిప్పులు చెరిగారు.
వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామ సర్పంచ్ మహిత పై దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఆ ఘటనను ఆటవిక చర్యగా అభివర్ణించారు. రౌడీ రాజకీయాలను సహించేదిలేదని, ఇక పై సహించమని, ఎంతటివారినైనా ఢీ కొంటామని నల్లారి హెచ్చరించారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ వైకాపా పాలసీగా మారిపోవడం ప్రజలు దౌర్భాగ్యంగా చెప్పుకొచ్చారు. విలేఖరుల సమావేశంలో సర్పంచ్ మహిత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కంభం నిరంజన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: భాష రాదనుకొంటే పొరపాటు.. వైకాపా శ్రేణులుకు పవన్ హెచ్చరిక