Amaravati: హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకొన్న ఆయన పిటిషన్ ఏపి హైకోర్టు కొట్టివేసింది. తన మాజీ కారు డ్రైవర్, దళిత యువకుడిని దారుణంగా హతమార్చిన కేసులో అనంత భాస్కర్ నిందితుడుగా ఉన్నాడు.
డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేసివున్నారు. పోలీసులు 90రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన్నప్పటికి ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. నాడు చోటుచేసుకొన్న దళిత యువకుడి హత్యా ఘటన రాష్ట్రంలో పెనుదుమారమే లేపింది.
ఇది కూడా చదవండి: ప్రెస్ కౌన్సిల్ సభ్యత్వానికి ఎంపీ రాజీనామా