Site icon Prime9

Ambati Rambabu: గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu

Ambati Rambabu

Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఏపీకి పరిశ్రమలు రాకుండా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టు విరిగిన గేటుని పరిశీలించిన అంబటి ప్రాజెక్టులపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ ఆరు కోట్ల రూపాయలను కూడా డ్యాం కోసం ఖర్చు పెట్టలేక పోయిందన్నారు.

గేట్లు ఐదారేళ్లుగా తుప్పుపట్టి ఉండడంతో గేటు దెబ్బతిందని దీంతో నీళ్లు బయటకు పోయాయని మంత్రి తెలిపారు. రెండు టీఎంసీలు సముద్రంలోకి వదలక తప్పదని వెల్లడించారు. గేట్ల మరమ్మతులను త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ఖరీఫ్‌కు సాగర్‌ నుంచి నీరు మళ్లించి గుండ్లకమ్మ నింపుతామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డ్యాంలకు పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాజెక్టుల గేట్లు రిపేర్లలో ఉన్న మాట వాస్తవమేనన్నారు అంబటి రాంబాబు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar