Site icon Prime9

AP Assembly: టీడీపీ ఎమ్మెల్యే పై మంత్రి మేరుగ వివాదాస్పద వ్యాఖ్యలు..

Minister-Meruga-nagarjuna

Amaravati: మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి పై చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభలో మంత్రి పై టీడీపీ ప్రివిలేజ్ మోషన్‌)ను ఇచ్చింది. అయితే టీడీపీ సభ్యుల్ని తాను ఏమీ అనలేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించలేదని మంత్రి మేరుగ తెలిపారు.

మంత్రి మేరుగ నాగార్జున పై టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. గురువారం స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు. డొలా బాల వీరాంజనేయ స్వామి పై మంత్రి మేరుగ నాగార్జున కామెంట్ల పై ఫిర్యాదు చేశారు. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ నాగార్జున, వీరాంజనేయ స్వామి పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యుల పుట్టుక గురించి అధికార పార్టీ నేతలు పదే పదే ప్రస్తావించడం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ తరహా వ్యాఖ్యలను స్పీకరుగా ఉండి, కంట్రోల్ చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబరులో ఉండగానే గడికోట శ్రీకాంత్ రెడ్డి లోపలకు వచ్చారు. మేరుగ నాగార్జున ఆ తరహా కామెంట్లు చేయలేదని శ్రీకాంత్ రెడ్డి సమర్థించారు. దీంతో శ్రీకాంత్ రెడ్డి పై టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలించుకోవాలని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

Exit mobile version