Site icon Prime9

minister gudivada amarnath: మూడు రాజ‌ధానులే రెఫ‌రెండంగా ఎన్నికలకు వెడతాం.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ap-minister-gudivada-amarnath

Amaravati: ఎవ‌రెన్ని యాత్ర‌లు చేసినా, త‌మ ప్ర‌భుత్వ విధానం మాత్రం మూడు రాజ‌ధానుల ఏర్పాటేన‌ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దించాలన్నదే అమరావతి రైతుల పాదయాత్ర లక్ష్యమని ఆరోపించారు. పాదయాత్రను లిప్ స్టిక్ రాసుకున్న వ్యాపారులకు అభివృద్ధి చెందని ఉత్తరాంధ్రవాసులకు మధ్య జరుగుతున్నయాత్రగా అమర్‌నాథ్ అభివర్ణించారు. ఎంపీ రఘురామరాజు లాంటి జోకర్ గురించి మాట్లాడడం సమయం వృథా అన్నారు.

అంతేకాకుండా మూడు రాజ‌ధానులే రెఫ‌రెండంగా 2024 ఎన్నిక‌ల‌కు వెడతామని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ ఐదేళ్ల‌లో చేసిన సంక్షేమం నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ‌తామ‌ని తెలిపారు. విశాఖ అభివృద్ధి వ‌ద్ద‌ని పాద‌యాత్ర పేరుతో ఉత్త‌రాంధ్ర వ‌స్తున్నారంటూ ఆయ‌న అమ‌రావతి రైతుల మ‌హాపాద‌యాత్ర‌ పై అమర్‌నాథ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Exit mobile version
Skip to toolbar