Andhra Pradesh: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు వింత వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా అరసవళ్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఈ మాటలు వ్యాఖ్యానించారు.
అమరావతి రాజధాని రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేపధ్యంలో మంత్రి ధర్మాన పై విధంగా స్పందించారు. అమరావతి నుండి అరసవళ్లి పేరుతో పాదయాత్రను రైతులు గత 26 రోజులుగా చేస్తున్నారు. ఈ క్రమంలో అరసవళ్లి వచ్చి దేవుణ్ణి మొక్కుకుని వెళ్తే మాకు అభ్యంతరం లేదు, గాని ఇక్కడకు వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం అంటూ హెచ్చరించారు. దశాబ్ధాల తర్వాత వచ్చిన అద్భుత అవకాశం 3 రాజధానులుగా ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు పెట్టుబడితో రైతులు పాదయాత్ర చేస్తున్నారని మాట్లాడారు. సిక్కోలు వాసులు విశాఖ రాజధాని కోసం గట్టిగా నినదించాలని పిలుపు నిచ్చారు.
వాస్తవంలోకి, మంత్రి ధర్మాన మంత్రిగా ఉండేది వైకాపా ప్రభుత్వంలో తాజాగా మంత్రి ధర్మాన రాజీనామ మాటలు వింత ధోరణికి దారితీస్తుంది. సీఎం జగన్ 3 రాజధానులకే మా స్టాండ్ అంటున్నారు. మంత్రుల చేత చెప్పిస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీ 3 రాజధానులకే సై అంది. ఎటొచ్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతాల మద్య చిచ్చు రేగితే, తాను మంత్రిగా ఆనాడే రాజీనామ చేస్తానన్న మాటను చెప్పుకొనేందుకు మంత్రి ధర్మాన ప్రసాదురావు వేసిన స్టెప్ గా ప్రజల్లో చర్చ సాగుతుంది. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో రాజీనామా చేయని మంత్రి అభివృద్ధి పేరుతో విశాఖ రాజధాని కోసం రాజీనామా అంటూ చేసిన ప్రకటనను ఓ డ్రామాగా చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: వెంకటగిరిలో ప్రోటోకాల్ వివాదం.. ఆగ్రహం వ్యక్తం చేసిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి