Visakapatnam: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహరాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
వివాహిత హత్య..
విశాఖలో దారుణం చోటు చేసుకుంది.ఓ వివాహితను యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహరాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
విశాఖలోని ఎంవీపి కాలనీ.. పరవాడకు చెందిన ఓ యువకుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరవాడకు చెందిన గోపాలకృష్ణ అనే యువకుడు.. వివాహిత శ్రావణి కలిసి బీచ్ కు వెళ్లారు. అక్కడ వీరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. తీవ్ర కోపోద్రికుడైన గోపాలకృష్ణ.. శ్రావణిని గొంతు నులిమి హత్య చేశాడు.
ఈ హత్య తర్వాత యువకుడు అక్కడినుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలు జగదాంబ కూడలిలోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివాహేతర సంబంధం ఏమైన ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఉలిక్కపడిన స్థానికులు..
ఈ హత్యతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుండటంతో.. చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ఏపీలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు కోరుతున్నాయి.