Site icon Prime9

Minsiter Roja : తీవ్ర అస్వస్థతకు గురైన మంత్రి రోజా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

latest news about minister roja health update

latest news about minister roja health update

Minsiter Roja : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, ప్రముఖ సీనియర్ నటి ఆర్కే రోజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతుంది. కొద్ది రోజులు క్రితం ఆమెకు కాలు బెణకడంతో వారం రోజులపాటు ఫిజియథెరపీ చేయించారు. అయినా నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే రోజాను డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే మంత్రి అస్వస్థతకు గురయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ కారణంగానే 10 రోజులుగా నియోజవర్గ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు రోజా. ప్రస్తుతం ఆమె పర్యాటక, సాంస్కృతిక యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి రోజా అస్వస్థతతో హాస్పిటల్లో చేరినట్లు తెలిసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. వారితో పాటు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రోజా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఫోన్ చేసి మాట్లాడారు.

సౌత్ ఇండస్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. 90వ దశకంలో దక్షిణాదిలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్నారు. సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్స్ హీరోల సరసన నటించిన ఆమె..ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణిని వివాహం చేసుకున్నారు. మంత్రి కాక ముందు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి కూడా జడ్జ్ గా వ్యవహరించారు రోజా.

 

Exit mobile version
Skip to toolbar