Site icon Prime9

Nara Chandrababu : చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.. ఆరోగ్యం ఎలా ఉందంటే ?

latest health updates on Nara Chandrababu sickness

latest health updates on Nara Chandrababu sickness

Nara Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా 34 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు.. వాతావరణ మార్పులవల్ల ఇటీవల డీహైడ్రేషన్‌కు గురి కాగా.. స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే జైలు సూపరింటెండెంట్‌ అనుమతితో వైద్య బృందం పలు పరీక్షలు నిర్వహించారు. డెర్మటాలజీ డాక్టర్ల సలహాతో చంద్రబాబు మెనూలో కొన్ని మార్పులు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారన్న డాక్టర్లు తెలిపారు.

జైలుకు వెళ్లిన డెర్మటాలజిస్టులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీత దేవి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేశారు. బాబు ఆరోగ్యంపై ఎలాంటి భయాందోళనలు, అపోహలు అవసరంలేదని వెల్లడించారు. రాజమండ్రి పరిసరాల్లో కొన్ని రోజులుగా వాతావరణం అంతగా బాగోలేదని.. పైగా 2వేల మందికి పైగా ఖైదీలు ఉన్న జైలులో ఉండటంతో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఏసీకి అలవాటు పడిన చంద్రబాబు.. జైలు వాతావరణంలో ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే సాయంత్రం చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్‌ కానున్నారు. ఇక మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో  సీఐడీ దాఖలు చేసిన  పీటీ వారంట్ కు  ఏసీబీ కోర్టు గురువారం నాడు ఆమోదించింది.  ఈ నెల  16న చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరు పర్చాలని  జడ్జి ఆదేశించారు.

 

Exit mobile version