Site icon Prime9

Fire Accident : తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం.. గోవిందరాజు స్వామి ఆలయం సమీపంలో !

latest ap news about fire accident at lavanya frames in tirupathi

latest ap news about fire accident at lavanya frames in tirupathi

Fire Accident : తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజు స్వామి ఆలయం పక్కనే ఉన్న దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం నేపథ్యంలో మాడ వీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నిప్రమాదం నేపథ్యంలో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదంలో భారీగా వాహనాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

కాగా ఈ ఘటన గురించి వివరాల్లోకి వెళ్తే.. ప్రఖ్యాత ఫొటో ఫ్రేమ్స్ షాపు లావణ్య ఫ్రేమ్స్ దుకాణం గోవిందరాజు స్వామి రధం పక్కనే ఉంది. దేవుళ్లకు సంబంధించిన వేలాది ఫొటోలు ఈ షాప్ లో ఉంటాయి. నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న ఈ షాప్ లో అనుకోని రీతిలో మంటలు ఎగసిపడ్డాయి. దాంతో రథం మంటపం వరకు మంటలు వ్యాపించాయి. షాపు ముందున్న వాహనాలు తగలబడిపోతున్నాయి. దీంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మాటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా ఈ ప్రమాదంలో ఇంకా మంటలు అదుపులోకి రానట్లు తెలుస్తోంది. మంటలార్పేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అని అధికారుల ఆరా తీస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version