Kodi Kathi Death: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో ఆంక్షలున్నప్పటికీ.. కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో కోడి పందాలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వీధి ఆడే వింటిహ నాటకంలో ఎవరు ఎప్పుడు అశువులు బాస్తారో చెప్పలేం.
అందరిలాగే తాను కూడా సరదాగా వెళ్ళి కోడి పందాలు చూద్దాం అనుకున్న ఆ యువకుడు.. ఇక తిరిగి రాని లోకాలకు చేరాడు. కత్తులు కట్టుకుని కొట్టాడుకునే కోళ్లు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో కోడి కత్తి గుచ్చుకుని(Kodi Kathi Death) ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అధికంగా రక్తస్రావం జరగడంతో ఆ యువకుడు తుదిశ్వాస విడిచాడు.
దీంతో ఆ యువకుడి కుటుంబం పండుగ పూట చేతికి అందొచ్చిన కొడుకు మరణించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
సంక్రాంతి సంబరాల్లో విషాదం..
తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన పద్మారావు ఊళ్లో జరుగుతున్న కోడి పందాల దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో బరిలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి.
ఈ తరుణంలో ఒక కోడికి కట్టిన కత్తి పద్మారావు కుడి కాలు మోకాలు వెనుక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది.
దీంతో నరాలు తెగిపోయి బరి మొత్తం రక్తమోడింది. బాగా రక్తం పోయి పద్మారావు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది చూసిన వెంటనే పద్మారావు స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే పద్మారావు ఎక్కువ రక్తం పోవడంతో చనిపోయాడని అతడి స్నేహితులు పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సీఐ లక్ష్మారెడ్డి వెల్లడించారు.
పద్మారావు మృతితో అనంతపల్లి విషాదఛాయలు అలుముకున్నాయి.
గత కొన్ని రోజులుగా పోలీసులు కోడి పందేలపై ఆంక్షలు విధిస్తున్నప్పటికి వాటిని కంట్రోల్ కేయడంలో విఫలమయ్యారు.
స్థానిక పోలీసులను పొలిటికల్ లీడర్లు తమ గుప్పిట్లో పెట్టుకోవటంతో ఈ సారి సైతం కోడి పందాలు యధావిధిగా నిర్వహించినట్లు తెలుస్తోంది.
క్రికెట్ మ్యాచ్ ను తలపించేలా ప్లడ్ లైట్ వెలుగుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట, లోన బయట, పెద్ద బజార్, చిన్న బజార్ లను కూడా నిర్వహిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. మరోవైపు కాకినాడ జిల్లాలో కోడిపందాల నిర్వాహకులు ఆకర్షణీయమయిన బహుమతులు అందచేస్తున్నారు.
వందల బరుల్లో కోడిపందాలు కొనసాగుతున్నాయి. పందేల్లో గెలిచిన కోడిపుంజు యజమానులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ఖరీదైన బైకులను బహుమతులుగా అందచేస్తున్నారు.
దీంతో కాయ్ రాజా కాయ్ అంటూ ఊపు మీదున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా పందాల్లో పాల్గొని.. మరింత ఉత్సాహం నింపుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/