Site icon Prime9

Janavani Program: ఈ నెల 21న తిరుపతిలో జనవాణి

Andhra Pradesh: తిరుపతిలో ఈ నెల 21వ తేదీన నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని జనసేన పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జీ‌ఆర్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తాజ్ హోటల్ నుంచి కన్వెన్షన్ సెంటర్ వరకు నిర్వహించే ర్యాలీలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొంటారని తెలిపారు.

రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల వినతులను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారని పేర్కొన్నారు. తిరుమల, తిరుపతి వాసుల సమస్యల పై వినతులు ఇప్పటికే అందాయని హరిప్రసాద్ తెలిపారు.

Exit mobile version