Site icon Prime9

Janasena Varahi Yatra : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ రిలీజ్..

janasena varahi yatra third phase tour schedule

janasena varahi yatra third phase tour schedule

Janasena Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. విశాఖపట్నంలో వారాహి విజయ యాత్రపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. విశాఖకు చెందిన పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఇప్పటికే రెండు విడుతల విజయవంతం కాగా మూడో విడత ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి ప్రారంభం అవ్వగా.. ఆగస్టు 19వ తేదీ వరకూ మూడో విడత వారాహి విజయ యాత్ర సాగనుంది. అందులో భాగంగా  ఈ రోజు (11/08/2023) మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గంలోని రుషికొండను సందర్శించారు.

వారాహి విజయ యాత్ర షెడ్యూల్ (Janasena Varahi Yatra)..

12వ తేదీ (శనివారం): ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్తారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శ.. సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సి.ఎన్.బి.సి. ల్యాండ్స్ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

13వ తేదీ (ఆదివారం) : వారాహి విజయ యాత్రలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

14వ తేదీ (సోమవారం) ఉదయం: 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు వెళ్తారు. అక్కడ ఆక్రమణకు గురైన భూములను సందర్శిస్తారు.

15వ తేదీ (మంగళవారం) మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

16వ తేదీ (బుధవారం) : విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తారు.

17వ తేదీ (గురువారం) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు.

Exit mobile version