Site icon Prime9

పవన్ కళ్యాణ్ : అంబటి కాపుల గుండెల్లో కుంపటి…

janasena chief pawan kalyan counter to weekend politician comment

janasena chief pawan kalyan counter to weekend politician comment

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో కౌలురైతు భరోసా యాత్ర సందర్భంగా బాధిత కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సభా వేదికపై ప్రసంగిస్తూ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. అంబటి రాంబాబు నియోజకవర్గంలో అడుగుపెట్టిన పవన్ అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విమర్శించాడు.

సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అవినీతి చేస్తున్నాడని అంబటిని ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు. రూ. 7లక్షల ఇన్స్యూరెన్స్ వస్తే అందులో రూ. 2 లక్షలు లంచం అడిగే వ్యక్తిత్వం నాది కాదని అంబటిది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో నన్ను చాలా వెటకారంగా మాట్లాడారని రాజుపాలెంలో జనసేనను ఉద్దేశించి గాజు అన్నారని అది గాజు కాదు అది నాగుండెల్లో దింపే గుణం అని సేనసేనాని అన్నారు. ఆయన అంబటి కాదని కాపుల గుండెల్లో కుంపటి అంటూ విమర్శించారు.

పోలవరం పూర్తి చేయటం తెలియదు కానీ మీరు నీటిపారుదల మంత్రా అంటూ ఆయన అంబటిపై సైటర్లు వేశారు. అంబటి, వైకాపా నాయకులవి ఉత్తర కుమార ప్రగల్భాలు అంటూ వ్యాఖ్యానించారు. శవం మీద పేలాలు వేరుకునే మనస్తత్వం అంబటి గారిదే నాది కాదు అంటూ సెటైర్లు వేశారు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై కోపం లేదు అని మీరు సంస్కారంగా ప్రవర్తిస్తే నా అంత సంస్కారమంతులు లేరని.. కానీ మీరు అవాకులు చెవాకులు పేలితే మేము చూస్తూ కూర్చోమంటూ పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version