Ysrcp MLC : స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నేడు ( మే 15, 2023 ) న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వారితో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. నర్తు రామారావు, కుడిపూడి సూర్యనారాయణ, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, అలంపూర్ మధుసూదన్, సిపాయి సుబ్రహ్మణ్యం, మేరుగు మురళీధర్, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ లుగా ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో (Ysrcp MLC)..
పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి (వైఎస్సార్ కడప జిల్లా, వైఎస్సార్సీపీ)
నార్తు రామారావు (శ్రీకాకుళం జిల్లా, వైఎస్సార్సీపీ)
కుడుపూడి సూర్యనారాయణ రావు (తూర్పుగోదావరి జిల్లా, వైఎస్సార్సీపీ)
వంకా రవీంద్రనాథ్ (పశ్చిమగోదావరి జిల్లా, వైఎస్సార్సీపీ)
కావూరు శ్రీనివాస్ (పశ్చిమగోదావరి జిల్లా, వైఎస్సార్సీపీ)
మేరిగ మురళీధర్ (నెల్లూరు జిల్లా, వైఎస్సార్సీపీ)
అలంపూరు మధుసూధన్ (కర్నూలు జిల్లా, వైఎస్సార్సీపీ)
సిపాయి సుబ్రమణ్యం (చిత్తూరు జిల్లా, వైఎస్సార్సీపీ)
ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బుడి ముత్యాల నాయుడు, చెల్లబోయిన వేణు, మెరుగు నాగార్జున , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.