CM Ys Jagan : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 26న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో పర్యటన చేయనున్నారు. అయితే ఈ పర్యటన కోసం స్థానికంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను అధికారులు తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఇప్పటికే స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుంచి బాలయోగి ఘాట్ వరకు సీఎం రూట్ మ్యాప్ ప్రకారం రోడ్డు పక్కన ఉన్న చెట్లను అధికారులు కొట్టేశారు. ముఖ్యమంత్రి ఒక్కరోజు పర్యటన కోసం పర్యావరణాన్ని కాపాడే చెట్లను నరికి వేయడం దారుణం అంటూ స్థానికులు, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా సీఎం హెలికాప్టర్ దిగేందుకు ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లను నరికి హేలీప్యాడ్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. అవి ముఫ్ఫై ఏళ్ల వయసు ఉన్న చెట్లని.. వాటిని కొట్టేయాల్సిన అవసరం లేదని అమలాపురం ప్రజలు అంటున్నారు. అమలాపురంలోని ఎస్ కే బీ ఆర్ కళాశాల, కిమ్స్ మెడికల్ కళాశాలలో రెండు హెలీ ప్యాడ్ లు ఉన్నప్పటికీ అవి కాకుండా రూ. 15 లక్షలు ప్రజాధనం వెచ్చించి.. పెద్ద ఎత్తున చెట్లను కొట్టి వేసి.. కొత్త హెలీప్యాడ్ నిర్మించారని మండీ పడుతున్నారు.
జగన్ విధ్వంస రాజకీయం
జగన్ అమలాపురం పర్యటన కోసం దారిపొడవునా చెట్లు నరికిస్తున్న అధికారులు, అడ్డుకున్న జనసేన నాయకులు.#HelloAP_WelcomeJSP #HelloAndhra_ByeByeJagan pic.twitter.com/BJj049xdPi
— JanaSena Party (@JanaSenaParty) July 21, 2023