Vijayawada: తమిళనాడు మీదుగా ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న అక్రమ బంగారు వ్యాపారుల పై కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. దీంతో 11కోట్ల రూపాయలు విలువచేసే బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
20 బృందాలుగా ఏర్పడి కస్టమ్స్ అధికారులు సీక్రెట్ ఆపరేషన్ లో ఈ దొంగ బంగారం పట్టుబడింది. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో చేపట్టిన సోదాల్లో రూ. 6.7కోట్ల విలువైన 13.189కిలోల బంగారం, రూ. 4.24 కోట్ల నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కార్లు, ఆర్టీసి బస్సులు, రైళ్లలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
గడిచిన కొద్ది రోజులుగా బంగారు విక్రయాలను అనధికారికంగా విక్రయిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. చెన్నై, హైదరాబాదు, విజయవాడ ఎయిర్ పోర్టుల ద్వారా భారీ యెత్తున బంగారాన్ని అక్రమంగా దేశానికి తరలిస్తూ పలువురు ప్రయాణీకులు కస్టమ్స్ అధికారులకు చిక్కారు. దీంతో కట్టడి చేసే పనిలో అధికారులు దృష్టి సారించారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో బంగారు విక్రయాలు అధికంగా జీరో బిజినెస్ రూపంలో సాగుతుండడంతో కట్టడికి యత్నాలు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి:Enforcement Directorate: తెరాస ఎంపీ నామా ఆస్తులను జప్తు చేసిన ఈడీ.. ఎంతంటే?