Site icon Prime9

Srisailam Fire Accident : శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం.. ఎన్ని కోట్లు ఆస్తి నష్టం అంటే ?

huge fire accident at srisailam and 2 crores assets lost

huge fire accident at srisailam and 2 crores assets lost

Srisailam Fire Accident : శ్రీశైలంలో అగ్నిప్రమాదం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఆలయ సమీపంలో ఉన్న ఎల్ బ్లాక్ కాంప్లెక్స్ లోని లలితాంబికా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటక మంటలు మొదలయ్యాయి. మంటలు చెలరేగి వ్యాపించడంతో భారీ నష్టం జరిగినట్లు చెబుతున్నారు.

దీనిపై సమాచారం అందగానే వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. కాగా.. ఈ ఘటనలో 15 దుకాణాలు దహనం అయ్యాయి. ప్రమాద స్థలానికి ఆలయ ఈవో లవన్న చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కాగా.. షార్ట్ సర్క్యూట్ వల్లే నిప్పు రవ్వలు పడి, మంటలు మొదలై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల ఆస్తి నష్టం వాటిళ్లందని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version