Site icon Prime9

Tenali anna canteen: తెనాలి మార్కెట్ కూడలి వద్ద టెన్షన్ వాతావరణం

tenali-anna-canteen

Tenali: గుంటూరు జిల్లా తెనాలిలోని పట్టణంలోని మార్కెట్‌ కూడలి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సారథ్యంలో ఆధ్వర్యంలో గత నెల 12 నుంచి అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈనెల ఒకటిన అన్నదాన కార్యక్రమాలు నిలిపివేయాలని, ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నాయని మున్సిపల్‌ అధికారులు నిర్వాహకులను కోరారు. అయినప్పటికీ ఈరోజు కూడా అన్న క్యాంటీన్ ను ఓపెన్ చేస్తామని ఆహారాన్ని పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగే అవకాశం ఉందనే సమాచారంతో క్యాంటీన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. చుట్టుపక్కలున్న షాపులను కూడా పోలీసులు మూసివేయించారు.

మార్కెట్‌ ప్రాంగణంలోకి రాకపోకలు కూడా నిలిపివేస్తూ నలువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కేవలం టీడీపీ చేపట్టిన అన్నా క్యాంటీన్‌ నిర్వహణను నిలిపివేయాలని దురుద్దేశంతోనే అధికార పార్టీ ఇలా చేసిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version