Rain Fall: ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న.. ఉన్నట్లుండి భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కడపలో గాలి బీభత్సానికి ఒకరు మృతిచెందారు.
ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న.. ఉన్నట్లుండి భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కడపలో గాలి బీభత్సానికి ఒకరు మృతిచెందారు.
భానుడి భగభగలతో అతలాకుతలమైన జనం.. కాస్త ఊపశమనం పొందారు. పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడటంతో.. సేదతీరారు. మరోవైపు కడపలో గాలివాన బీభత్సం సృష్టించింది. అలాగే భారీ వర్షం పలు ప్రాంతాలను నీటముంచింది. పులివెందులలోని మెయిన్ బజార్ వద్ద కొన్ని దుకాణాల్లోకి వర్షం నీరు ప్రవహించింది. దీంతో వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. సరుకు తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు.
కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఈదురు గాలి బీభత్సం సృష్టించింది. గాలి బీభత్సంతో ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న రేకుల షెడ్డు పైకప్పు గాలిలోకి ఎగిరి 33 కెవి విద్యుత్ తీగలపై పడడంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షం పడటంతో రేకుల కింద తలదాచుకున్న వ్యక్తి మీద రేకులు పడ్డాయి. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బేతాయపల్లి గ్రామానికి చెందిన చిన్న సుబ్బయ్య (55)గా గుర్తించారు.