Site icon Prime9

Attack On RTC Driver : హారన్ కొట్టినందుకు కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడి.. వీడియో వైరల్

group of people Attack On RTC Driver at kavali for blowing horn

group of people Attack On RTC Driver at kavali for blowing horn

Attack On RTC Driver : నెల్లూరులో రోడ్డుకు అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనం తీయాలని హారన్‌ మోగించినందుకు ఆర్టీసీ డ్రైవర్ ని దారుణంగా కొట్టారు ఓ గుంపు. బస్సు వెనకాలే వెంబడించి వచ్చిన ఒక గుంపు.. బస్సును అడ్డుకొని.. డ్రైవర్ ని బలవంతంగా కిందకు దింపి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. పిడి గుద్దులు గుద్దుతూ.. కాలితో కూడా విపరీతంగా కొట్టడంతో అస్వస్థతకు గురై డ్రైవర్ కిందపడినా.. వదిలిపెట్టలేదు. అడ్డుకోబోయిన వారిపై కూడా దాడి చేసి.. సదరు డ్రైవర్ ని ఇక్కడే చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. ఆ ఘటనను వీడియో తీస్తున్న పలువురు ఫోన్ లను కూడా లాక్కునే యత్నం చేశారు. ప్రస్తుతం ఈ దారుణ ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ దాడి ఘటనలో పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దూరుపాడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీ 16జడ్‌ 0702 నంబరు బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది. ట్రంకు రోడ్డు మీదుగా వెళ్తుండగా ఓ బైక్ రోడ్డుకు అడ్డుగా ఉండటంతో బస్సు డ్రైవరు బి.ఆర్‌.సింగ్‌ హారన్‌ మోగించారు. దాంతో ఆ వాహనదారుడు డ్రైవరుతో వాదనకు దిగాడు. ఆ సమయంలో వెనుకవైపు ఆగిన వాహనాలు హారన్‌ మోగించడం, అక్కడే ఉన్న ఒకటో పట్టణ పోలీసులు స్పందించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత తన మిత్రులైన దేవరకొండ సుధీర్‌ తదితరులకు విషయం తెలియజేసి.. దాదాపు 14 మంది టీఎన్‌ సీ9 1612 నంబరు కారు, బైక్ లపై ఆర్టీసీ బస్సును వెంబడించి అడ్డుకున్నారు. డ్రైవరును బలవంతంగా కిందకి దించి విచక్షణ రహితంగా  దాడికి పాల్పడ్డారు. విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ని కావాలి ప్రాంతి ఆసుపత్రికి తరలించారు. ఈ శివారెడ్డి, మల్లి, విల్సన్, కిరణ్, దేవరకొండ సుదీర్లతో పాటు మరో పదిమంది మీద హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంగళరావు నగర్ లో ప్రత్యేకంగా స్థావరం ఏర్పాటు చేసుకొని ఇలాంటి ఘటనలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనిమీద ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు కూడా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అదే విధంగా ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

అలానే టీడీపీ నేత నారా లోకేష్‌ కూడా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్‌ సొంత బాబాయ్‌ వివేకానందరెడ్డిని వేసేస్తే… ఆయ‌న సైకో ఫ్యాన్స్ హార‌న్ కొట్టార‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేశారని ఆరోపించారు. పట్టపగలు… న‌డిరోడ్డుపై వైసీపీ నేత‌లు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారని అన్నారు. పెద్ద సైకో జ‌గ‌న్ పోతేనే.. పిల్ల సైకో గ్యాంగుల‌న్నీ సైలెంట్‌ అవుతాయని లోకేష్‌ ఫైర్ అయ్యారు.

 

 

 

Exit mobile version