CM Jagan: నిరుద్యోగ యువతకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల జారీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో.. ఏపీలో త్వరలో రెండు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
గ్రీన్ సిగ్నల్..
నిరుద్యోగ యువతకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల జారీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో.. ఏపీలో త్వరలో రెండు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ పచ్చజెండా ఊపారు.
గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు సుమారు 1000కి పైగా ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వీటి భర్తీ విషయంలో.. గురువారం ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష సందర్భంగా పోస్టుల భర్తీపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగేలా చూడాలని జగన్ సంబంధిత అధికారులకు సూచించారు. గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా, గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీ చేయనున్నామని అధికారులు సీఎంకు వివరించారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని సూచించారు.