Site icon Prime9

Nara Chandrababu Naidu Arrest : జగ్గయ్యపేటలో ప్లెక్సీలు కలకలం.. సీఎం జగన్ కి ఎన్టీఆర్, హరికృష్ణ థాంక్స్

flexy issue at jaggayyapeta about nara chandrababu naidu arrest

flexy issue at jaggayyapeta about nara chandrababu naidu arrest

Nara Chandrababu Naidu Arrest : ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఊహించని విధంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కేసులో తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా గాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏపీ బంద్ కి పిలుపునివ్వగా.. బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలు, షాప్ లను తెదేపా నేతలు మూసేయిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

టీడీపీ ముఖ్య నాయకులు ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు గృహనిర్భందం చేసారు. వైకాపా నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జగ్గయ్యపేటలో చంద్రబాబు అరెస్ట్ తో నందమూరి కుటుంబం సంతోషపడుతుందని అనే విధంగా ఫ్లెక్సీలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఆ ఫ్లెక్సీ లో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సీఎం జగన్ కు థ్యాంక్స్ చెబుతున్నట్లు ఉంది. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా ఈ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అందులో.. ”థ్యాంక్యూ జగన్.. నా ఆత్మకు శాంతి చేకూర్చావు. నన్ను చివరి దశలో అనేక అవమానాలకు.. అత్యంత క్షోభకు గురిచేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను చనిపోయాక కూడా ఆ మరణాన్ని రాజకీయాల కోసం వాడుకున్నాడు. నా కుమారుడు హరికృష్ణ, మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కుటిల రాజకీయాలకు వాడుకున్నాడు. ఇలా మా కుటుంబ మరణాలను వాడుకుని నీచ రాజకీయాలు చేసిన వీడికి బుద్దిచెప్పి నా ఆత్మకు శాంతి చేకూర్చావు. నీచుడు, దుర్మార్గుడైన చంద్రబాబు జైలుకు వెళుతున్న సెప్టెంబర్ 10న ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని తెలుగు ప్రజలను కోరుతున్నా అంటూ సీనియర్ ఎన్టీఆర్ సంతకంతో ప్లెక్సీలో ఉంది. సీనియర్ ఎన్టీఆర్ యూత్ అసోసియేషన్ పేరుతో వెలిసిన ఈ ప్లెక్సీలపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version