Site icon Prime9

Buggana RajendraNath: పిట్టకథల మంత్రి అంటూ బుగ్గన పై ఫ్లెక్సీలు

Flexes

Flexes

Andhra Pradesh: నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలో ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పిట్టకధల మంత్రి అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారని సమాచారం.

డోన్‌లోని రుద్రాక్ష గుట్టలో వైఎస్‌ హయాంలో ప్రజలకి ఇళ్ల కోసం స్థలాన్ని కేటాయించారు. అయితే వీటికి సంబంధించి ఇప్పటివరకు పట్టాలు మాత్రం ఇవ్వలేదు. తరువాత వచ్చిన టీడీపీ నేతలు కూడా వాటి గురించి పట్టించుకోలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాలు ఇస్తామన్నారు. అయినా అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా పట్టాలగురించి పట్టించుకోవడం లేదని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి స్దానిక సీపీఐ నాయకులు అండగా నిలిచారు. దీనితో డోన్ ప్రధాన కూడలిలో మంత్రికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టారు.

 

Exit mobile version