YS Bhaskar reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డి.. చంచల్ గూడ జైలులో అస్వస్థకు గురయ్యారు. ఒక్కసారి రక్తపోటు పెరగడంతో.. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
పెరిగిన రక్తపోటు..
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డి.. చంచల్ గూడ జైలులో అస్వస్థకు గురయ్యారు. ఒక్కసారి రక్తపోటు పెరగడంతో.. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఉదయం రక్తపోటు పెరగడంతో.. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మళ్లీ జైలుకి తీసుకొచ్చారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్టు సమాచారం.
కొనసాగుతున్న వాదనలు..
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. హై కోర్టులో ఎంపీ అవినాష్ తరపు న్యాయవాదులు వాదనలు కొనసాగిస్తున్నారు.
మరో వైపు అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని హైదరాబాద్ తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఈనెల 19 నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. డిశ్చార్జ్ అనంతరం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.