Site icon Prime9

Family Suspicious Death : విజయనగరం జిల్లాలో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. హత్యా ? ఆత్మహత్య ??

family suspicous death at vijayanagaram news got viral

family suspicous death at vijayanagaram news got viral

Family Suspicious Death : విశాఖపట్నం మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ (46) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అయితే ఏమైందో తెలీదు కానీ ఊహించని విధంగా మహముద్దీన్, అతని భార్య, కూతురు కూడా విజయనగరం జిల్లాలో మృత దేహాలుగా లభ్యమవడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అయితే వారు ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో లేక ఎవరైనా వారిని హత్య చేశారా అనే  అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈ ఘటనలో వివరాలలోకి వెళ్తే.. వైజాగ్ లోని మర్రిపాలేమో ఉండే మహముద్దీన్, అతని భార్య షరీష నిషా(39), కూతురు ఫాతిమా జహార(18) విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల మధ్యలోని ఓ బావిలో మృతదేహాలుగా తేలారు. వారి మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నీటిపై తేలుతున్న మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం వారి బందువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మహముద్దీన్ కుటుంబానిది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version