Black Magic : ప్రస్తుత కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ 2023 లో సగం ఏడాది వరకు వచ్చేశాం. మనుషులు ఎంత మారుతున్న ఎంత అభివృద్ధి చెందుతున్న.. మానవ మనుగడాని విస్తరిస్తూ నూతన సాంకేతికతతో దూసుకుపోతుంటే కొందరు మాత్రం మూఢ నమ్మకాల ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి ఊబిలోకి నెట్టుకుంటున్నారు. ఏ మతం అయినా, ఏ ఆచారం అయిన నమ్మడం తప్పు కాదు.. అది వారి వ్యక్తిగత నిర్ణయం కానీ మూఢ నమ్మకాలు, మితిమీరిన ఆశలతో చేదు దారుల్లోకి వెళ్ళడం మాత్రం ఎవ్వరికీ మంచిది కాదు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే మన రాష్ట్రంలో వెలుగు చూసింది. అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు చేయిస్తూ ఓ తాంత్రికుడు వారిని అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో బయటపడింది. ఓ మహిళ సహకారంతో అమ్మాయిలకు డబ్బుల ఆశచూపి పూజలు చేస్తున్నాడు ఈ కేటుగాడు. అతడి చేతిలో మోసపోయిన యువతులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ క్షుద్రపూజల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ భయానక ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంత్రతంత్రాలతో డబ్బులు సంపాదించవచ్చని అమాయకులను నమ్మించేవాడు. ఈ మాయమాటలు నమ్మినవారితో క్షుద్రపూజలు చేయించేవాడు. ఇలా చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళ కూడా ఈజీగా డబ్బులు సంపాదించాలని భావించి సదరు తాంత్రికుడిని ఆశ్రయించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తాంత్రికుడితో పరిచయం పెంచుకున్న మహిళ పూర్తిగా అతడి మాయలో పడిపోయింది. ఆ మహిళ సాయంతో అమ్మాయిలకు వలవేసి క్షుద్రపూజలు చేయసాగాడు తాంత్రికుడు. ఈ విధంగా కర్నూలు జిల్లాకు చెందిన కొందరు అమాయక అమ్మాయిలకు డబ్బులు ఆశచూపి క్షుద్రపూజలు కోసం తీసుకువచ్చారు.
క్షుద్ర పూజలతో పాటు యువతులపై అత్యాచారం (Black Magic)..
వారితో పదిరోజుల పాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో క్షుద్రపూజలు నిర్వహించారు. అమ్మాయిల ఒంటిపై నూలుపోగు లేకుంగా పూర్తి నగ్నంగా పూజలో కూర్చోబెట్టేవారు. ఇలా పదిరోజుల పాటు పూజలు చేస్తున్న సమయంలోనే యువతులపై అత్యాచారం కూడా జరిపినట్లు యువతులు వెల్లడించారు. అయితే ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండానే తిరిగి కర్నూలుకు పంపించారు. చివరకు మోసపోయాం అని గుర్తించిన ఇద్దరు యువతులు పొన్నెకల్లుకు వెళ్లి తాంత్రికున్ని నిలదీసారు. దీంతో ఆ మహిళ, తాంత్రికుడు ఇద్దరు ఆ అమ్మాయిలను బలవంతంగా ఓ వాహనంలో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.
వాహనం ఆగిన సమయంలో తప్పించుకున్న అమ్మాయిలు పోలీసులకు దిశా ద్వారా సమాచారం అందజేశారు. బాధిత యువతుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు. తాంత్రికుడు మాత్రం తప్పించుకున్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి దొంగబాబాలు,తాంత్రికుల మాయమాటలు అమ్మాయిలు నమ్మవద్దని పోలీసులు సూచించారు.