Site icon Prime9

Face Attendance App: ఏపీలో అక్టోబర్ 25 నుండి ఫేస్ యాప్ హాజరు

Face app attendance has been made mandatory in AP from October 25

Face app attendance has been made mandatory in AP from October 25

Amaravati: ఏపీ సీఎం జగన్మెహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో అక్టోబర్ 25 నుండి ఫేస్ యాప్ హాజరును తప్పనిసరి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉపాద్యాయుల పై కక్ష సాధింపు చర్యలను చేపట్టిన ప్రభుత్వం ఫేస్ యాప్ ను నాడు బలవంతంగా వారి పై రుద్దింది. ఆ సమయంలో వారి నుండి వ్యతిరేకత కూడా రావడం జరిగింది. పాఠాలు చెప్పే గురువులకు ఫేస్ యాప్ తప్పనిసరి చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అందులోనూ అందుకు తగ్గ సాంకేతికతను ఇవ్వకుండా వ్యక్తిగత ఫోన్లలో ముఖ యాప్ ను అమలు చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టాయి.

అంచలంచెలుగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫేస్ యాప్ హాజరు అమల్లోకి తీసుకొస్తామని మంత్రులు నాడు ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం ఆ దిశగా అడుగులు వేస్తూ ముఖ ఆధారిత హాజరును అన్ని శాఖల్లోనూ తప్పని సరి చేశారు.

ఇది కూడా చదవండి:Heavy Rains: కట్ట తెగిపోతుంది జాగ్రత్త.. అప్రమత్తం పై అనంతపురం అధికారుల మెసేజ్

Exit mobile version