Site icon Prime9

MP Raghu Rama Krishnam Raju: తప్పు చేసిన పోలీసులు తప్పించుకోలేరు

Erring police cannot escape

Erring police cannot escape

Delhi: అధికార పార్టీ పోలీసింగ్ గా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులను వైకాపీ పార్లమెంటు సభ్యుడు రఘరామ కృష్ణంరాజు వారి బూజు విదిల్చే పనిలో పడ్డారు. తప్పు చేసిన పోలీసులు తప్పించుకోలేరంటూ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైకాపా ప్రభుత్వం ఏపి అధికారంలో ఉండేది కొద్ది నెలలేనని, తిరిగి వచ్చే దాఖలాలు లేవన్న ఎంపీ,  వైకాపా నేతల ప్రాపకం కోసం వెంపర్లాడద్దని పోలీసులకు హితవు పలికారు. రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పాలన సాగుతుందో, ఎటువంటి పాలన, పోలీసింగ్ వ్యవస్ధలో ప్రజలు జీవనం సాగిస్తున్నారో తెలుసుకోవాలన్నారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టే వారిని హత్యయత్నం కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. చెన్నుపాటి గాంధీ కన్ను పొడిచిన వారికి నామ మాత్రపు బెయిల్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన  ప్రశ్నించారు.

వైఎస్ వివేకా హత్యపై విచారణ చేపట్టేందుకు వచ్చిన సిబీఐ అథికారి పై కూడా పోలీసులు కేసు పెట్టారంటే పాలన ఎలాగుందో అర్ధమౌతుందన్నారు. పోలీసు వ్యవస్ధలోని లోపాలను కానిస్టేబుల్ ప్రకాష్ ఎత్తిచూపుతున్నారని, ఐపిసి నిబంధనలతో కూడిన పోలీసు పాలన ఉండాలంటూ ఎంపీ రఘురామ విజ్ఞప్తి చేశారు.

అమరావతి కోసం తలపెట్టిన మహా పాదయాత్రకు అనుమతి నిరాకరించిన ఏపి డిజిపి వ్యవహారం విడ్డూరంగా ఉందన్నారు. అయితే ప్రజల ప్రాధిమిక హక్కులను దృష్టిలో ఉంచుకొని పాదయాత్రకు అనుమతి ఇచ్చిన కోర్టు న్యాయమూర్తులకు అమరావతి రైతుల పక్షాన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని ఎంపి ప్రకటించారు.

విశ్వేశ్వర రెడ్డి గతంలో వైఎస్ జగన్ కు డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ విషయాన్ని ఎంపీ రఘరామ ఈ సందర్భంగా గుర్తు చేసారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తల్లో ఆయన పేరు ఉండడం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. రాష్ట్రంలోని రెండు ప్రాజక్ట్ లకు ప్రతిపాదన చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఎంపీ విశ్వేశ్వర రెడ్డికి చెందిన కంపెనీ అడ్రస్సులు ఓ మిఠాయి దుకాణం పేరుతో ఉన్నాయని పేర్కొన్నారు.

Exit mobile version