Site icon Prime9

Voter Registration: పట్టభధ్రులను ఓటర్లగా నమోదు చేయించండి.. పురపాలక సంఘ అధికారులు

Enroll graduates as voters

Enroll graduates as voters

Sullurpet Municipality: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట పురపాలక సంఘ పరిధిలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు స్థానిక సచివాలయ సిబ్బంది, కో-ఆప్షన్ మెంబర్లతో సమావేశమైనారు. పురపాలక పరిధిలో కొత్త ఓటర్లను వీలైనంత మందిని చేర్చాలని పేర్కొన్నారు. ప్రతి వార్డులోని పట్టభద్రుల వివరాలు సేకరించి ఆన్ లైన్లో ఓటు నమోదు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. సెలవు దినాలైన శని, ఆదివారాల్లో అధిక సంఖ్యలో ఓటర్లగా చేర్చాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పురపాలక సంఘ ఛైర్మన్ శ్రీమంత్ రెడ్డి, అధికారులు శ్రీనివాసరావు, బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపియుటిఎఫ్, తెదేపా, భాజపా, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్ధులతో పాటు తదితరులు పోటీకి సమాయత్తమౌతున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi Vizag Tour: నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోదీ

Exit mobile version