Site icon Prime9

Nara Lokesh : “యువగళం” పాదయాత్రలో ఉద్రిక్తత .. నారా లోకేష్ పై గుడ్లు విసిరిన ఆకతాయిలు !

eggs thrown on nara lokesh in yuvagalam padayatra

eggs thrown on nara lokesh in yuvagalam padayatra

Nara Lokesh : తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న “యువగళం” పాదయాత్ర గురించి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చేరింది. అయితే ఈ పాదయాత్రలో తాజాగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గురువారం రాత్రి సమయంలో నారా లోకేష్ పై కోడి గుడ్డుతో దాడిచేశారు. అయితే ఆ గుడ్డు లోకేష్ కు తగలకుండా పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తగిలింది. దీంతో సెక్యూరిటీ అప్రమత్తం అయ్యి కోడిగుడ్లు విసిరిన వ్యక్తులను గుర్తించిన టీడీపీ కార్యకర్తలు.. వారిని వెంబడించి పట్టుకుని చితకబాదారు.. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఎటువంటి గొడవలు జరగకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో బహిరంగ సభ ముగించుకుని ఆర్టీసి బస్టాండ్ దాటిన తరువాత ఓ దుకాణం వద్ద ఆగి ప్రజలతో మాట్లాడుతుండగా గుడ్ల దాడి జరిగింది. అయితే ఈ సంధర్భంగా పోలీసు సెక్యూరిటీ ఉన్నప్పటికీ దాడి జరగడంపై టిడిపి వర్గాలు పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు న్యాయం వైపు కాకుండా వైసీపీకి కొమ్ముకాస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఈ మేరకు పోలీసుల సెక్యూరిటీపై లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. (Nara Lokesh) లోకేశ్‌పై కోడిగుడ్డు వేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Exit mobile version