Site icon Prime9

Bandaru Satyanarayana Murthy: చంద్రబాబు సతీమణిని దూషించిన్నప్పుడు గుర్తుకు రాలేదా.. మాజీ మంత్రి బండారు

Don't you remember when you insulted Chandrababu's wife

Vizag: రేడియంట్ భూముల విషయంలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ టీడీపీ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులను రాజకీయ వివాదాల్లోకి తీసుకురావద్దని నీతి వ్యాఖ్యలు చెపుతున్న వైకాపా ఎంపీ వేమిరెడ్డికి నాడు చంద్రబాబు సతీమణిని దూషించినపుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్ భారతి గృహణి మాత్రమే కాదని గుర్తుంచుకోవాలన్నారు. సాక్షి సంస్ధకు ఛైర్మన్ అని, అ పత్రికలో దొంగ వార్తలు రాయిస్తుంది భారతియేని ఆయన ఆరోపించారు. అలాగే భారతి సిమెంట్ ఎవరిదని నిలదీశారు. భూముల కుంభకోణంలో సీబీఐ విచారణను ఎంపీ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ అవినీతిని బయటకు తీస్తామని, అవసరం అయితే జైల్‌కు వెళతామని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ నేతలు భూములు కొల్లగొడుతున్నారని బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Exit mobile version