Nandyala: ఏపీ ప్రభుత్వ పనితీరు నానాటికి దిగజారిపోతుంది. నిత్యం ఎక్కడో ఓ చోట విధ్వంసాలు, కొట్లాటలు, మాటల తూటాలు, అసభ్యకరమైన స్ననివేశాలు. తాజాగా ఓ మంత్రి సమక్షంలోనే నాటు సారా గుప్పుమనింది. అక్రమ మద్యం పై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసు యంత్రాంగం, చోధ్యానికే పరిమితమైన ఆ ఘటన డోన్ లో చోటుచేసుకొనింది.
వివరాల మేరకు, నంద్యాల జిల్లా డోన్ లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సమక్షంలో పలువురు వైకాపాలో చేరారు. దీంతో అక్కడ సభ నిర్వహించారు. సభా ప్రాంగణం సమీపంలోనే జనానికి కర్ణాటక మద్యాన్ని బహిరంగానే పంచారు. నాటుసారాను బిందెలతో తీసుకొచ్చి మరీ తాగించారు. గ్లాసుల్లో, బాటిళ్ల నింపుకొని తాగుతూ తందనాలాడారు. ఇందుకోసం ఓ వ్యాన్ ను కూడా సభా ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు.
అధికారం పేరుతో విచ్చలవిడి మద్యం పంపిణీని వైకాపా నేతలు చేపట్టారు. ఈ తంతు అంతా వీడియోల రూపంలో వైరల్ కావడంతో అసలు విషయం బయటపడింది. వాటిని తీసుకోవడానికి ఒకరి పై ఒకరు తోసుకుంటూ జనం ఎగబడ్డారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. సరికదా తమకు ఏం సంబంధం లేనట్లు ప్రవర్తించారు.
ఏపీలో మద్యం అమ్మకాలను అంచలంచలుగా నిషేధిస్తామని పేర్కొన్న ప్రభుత్వం, ఇలా ఆర్ధిక మంత్రి సమక్షంలోనే నాటు సారా ఏరులై పారడం పై సర్వత్రా విశ్మయం వ్యక్త మవుతుంది.
ఇది కూడా చదవండి: సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే మేము రెడీ.. సజ్జల