Site icon Prime9

AP Deputy CM: డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం

Deputy CM has a bitter experience on Indrakeeladri

Deputy CM has a bitter experience on Indrakeeladri

Indrakeeladri: పాలన వ్యవహారాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిత్యం అభాసుపాలౌతుంది. తాజాగా డ్యూటీ సిబ్బంది ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రికి ప్రవేశం లేదని ఖరాఖండిగా చెప్పడంతో అవాక్కవడం ఆయన వంతైంది. ఈ ఘటన ఇంద్ర కీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో చోటుచేసుకొనింది.

సమాచారం మేరకు, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్ధానంలో దేవి నవరాత్రుల వైభవంగా సాగుతున్నాయి. శరన్నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అమ్మవారిని దర్శించుకొనేందుకు ఆలయానికి వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది మంత్రి అని కూడా చూడకుండా ఆయనతో అతిగా వ్యవహరించారు. గేట్లకు తాళాలేసేశామని, క్యూలైను మార్గంలో వెళ్లాలని ఆయనకు సూచించారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఉప ముఖ్యమంత్రి అక్కడే నిలిచిపోయారు.

కొద్ది సేపటి తర్వాత సమాచారం అందుకొన్న ఆలయ ఈవో భ్రమరాంబ హుటాహుటిన డిప్యూటీ సీఎం వద్దకు చేరుకొని జరిగిన పొరపాటుకు మన్నించమని కోరారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఆలయం లోపలకు తీసుకెళ్లి దగ్గరుండీ మరీ పూజలు చేయించారు. అమ్మణ్ణి దర్శనాంతరం తీర్ధ ప్రసాదాలు అందచేసి మరోమారు పొరపాటును మరిచిపోవాలని ఆయన్ను వేడుకొన్నారు.

ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రవేశించే ప్రధాన ద్వారం, క్యూలైన్ల పర్యవేక్షణను పూర్తిగా పోలీసులు వారి చేతుల్లోకి తీసుకొన్నారు. దీంతో డ్యూటీ పాస్ ఉన్న ఉద్యోగులను సైతం లోపలకు పంపడం పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఆలయ అర్చకులను లోపలకు పంపకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాజాగా డిప్యూటీ సీఎం పట్ల వారు ప్రవర్తించిన తీరుతో పోలీసుల తీరును  భక్తులు, ఆలయ సిబ్బంది తప్పు బడుతున్నారు.

ఇది కూడా చదవండి: డీజీపి వాహనానికి ఇ చలానా కట్టరా.. వైరల్ అయిన మెసేజ్

Exit mobile version