Site icon Prime9

Viveka Murder Case: కుట్ర జరుగుతోంది.. కాపాడండి.. మరోమారు ఎస్పీ దగ్గరకు దస్తగిరి

Conspiracy is going on...save...Dastagiri yelled at the SP again

Conspiracy is going on...save...Dastagiri yelled at the SP again

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ బాబయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్ మారిన డ్రైవర్ దస్తగిరి మరో మారు కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పులివెందుల నుండి కడపకు వచ్చిన దస్తగిరి తొలుత సీబీఐ అధికారులను కలసి అనంతరం ఎస్పీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ నెల 2న తన ఇంటి పెంపుడు కుక్క అకస్మాత్తుగా చనిపోయిందని, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని పేర్కొన్నాడు. 6వ తేదీని గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి కుక్కను కొంటామని అడిగారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని పేర్కొన్నాడు. ఇన్నోవా కారులో 6 గురు వ్యక్తులు ఆ సమయంలో ఉన్నట్లు తెలిపారు. వీటన్నింటిపై విచారణ చేయాలని ఎస్పీ అన్బురాజుకు దస్తగిరి ఫిర్యాదు చేశారు.

రెండురోజుల క్రితం కూడా తన గన్ మెన్ లను ఆకస్మాత్తుగా మార్చారని, దీనిపై అభ్యంతరం వెలిబుచ్చుతూ ఎస్పీ కి దస్తగిరి ఫిర్యాదు చేసివున్నాడు. ఆ సమయంలో నాకేదైన జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాలని కూడా పేర్కొని వున్నారు.

అయితే దస్తగిరి విషయంలో ఏపీ ప్రభుత్వంతోపాటుగా పోలీసులు కూడా ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని వాస్తవ పరిస్ధితులను బట్టి తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:  నాకు ప్రాణహాని జరిగితే సీఎం జగన్ దే బాధ్యత.. దస్తగిరి

Exit mobile version